EPFO BIG UPDATE: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) తన లక్షలాది మంది సభ్యులకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ‘సువిధ ప్రొవైడర్లు’ లేదా ‘ఫెసిలిటేటర్లు’ అనే కొత్త సేవా విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడం, దరఖాస్తులు, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం, ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపడం ఈ చర్య వెనుక ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
EPFO Family Pension: ఈపీఎఫ్ఓ ప్రకారం.. ఈఈసీ కింద నమోదు అయిన ఉద్యోగి ఒక్క రోజు పనిచేసినా.. సర్వీసులో మరణిస్తే..కుటుంబానికి పెన్షన్ హక్కు ఉంటుంది. భార్యాభర్తలు, పిల్లలు, లేదా తల్లిదండ్రులకు ఈపీఎస్ -95 కింద నెలవారీ పెన్షన్ అందుతుంది. గత సంవత్సరాలకు సంబంధించిన ఉద్యోగి చందాలు పూర్తిగా చెల్లించకపోయినా, యజమాని తన వాటా చందాను చెల్లించి ఉంటే ఈ పెన్షన్ ప్రయోజనం వర్తిస్తుందని అధికారులు వివరించారు.
PF Salary Limit: EPFO కింద పీఎఫ్ జీత పరిమితిని రూ.25,000 నుంచి 30,000కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులు, పెన్షన్‌ను పెంచినా, టేక్ హోమ్ జీతం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది భద్రతను బలోపేతం చేస్తుంది.
EPF limit: సుమారు 11 ఏళ్లుగా మార్పులేని EPF జీత పరిమితిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీతాలు, ద్రవ్యోల్బణం పెరిగినా పరిమితి సవరించకపోవడం వల్ల ఉద్యోగులు సామాజిక భద్రత కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Employee Enrollment Scheme-2025: ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎంప్లాయీ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ – 2025 అనే కొత్త స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా గతంలో వివిధ కారణాల వల్ల ఈపీఎఫ్ పరిధి నుంచి తప్పిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా యజమానుల నిర్లక్ష్యం, అవగాహన లోపం లేదా పరిపాలనా కారణాల వల్ల ఈపీఎఫ్ఓ ఖాతాల్లో నమోదు కాని కార్మికులను మళ్లీ సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
EPF withdrawal New Rules: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సంవత్సరం సరికొత్త శుభవార్తను అందించబోతోంది. కొత్త సంవత్సరం 2026 నుంచి ఉద్యోగస్థులకు ఈపీఎఫ్ విషయంలో భారీ ఉపశమనం కల్పించే మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు బాసటగా నిలుస్తూ.. అవసరం, అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బును విత్ర డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
EPF Ceiling Limit 2025: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు కనీస వేతన పరిమితిని పెంచాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితి నెలకు రూ. 15,000గా ఉండగా..దీని కారణంగా చాలా మంది కార్మికులు పదవీ విరమణ తర్వాత అనేక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఉద్యోగుల అవసరాన్ని గుర్తించిన మోదీ సర్కారు లోక్‌సభలో ఈ విధంగా తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు అయ్యింది.
EPFO: నూతన సంవత్సరానికి ముందు ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు EPFO జీత పరిమితిని పెంచింది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. EPFO (Employees Provident Fund Organisation) పరిమిత పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా లాభం కలగనుంది.
PF Balance: మీరు ఇంట్లో కూర్చుండి.. ఆన్ లైన్ లో సులభంగా కొంత మొత్తంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు కూడా దీని కోసమే చూస్తున్నట్లయితే ఈపీఎఫ్ నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
EPFO Housing Advance Process: మీరు ప్లాట్, ఫ్లాట్ లేదా స్వంత ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. లోన్ తీసుకోవాలా లేదా అనే సందేహంలో ఉన్నారా. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలుకు అడ్వాన్స్ రూపంలో నిధులను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అంటే.. మీరు మీ EPF ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట షరతుల ప్రకారం ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం ఉపయోగించుకోవచ్చు. EPFO తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అయితే.. దీనికి కొన్ని నిబంధనలు, పరిమితులు వర్తిస్తాయి. అవేంటో చూద్దాం.
EPFO 3.o Launch Date: ప్రావిడెంట్ ఫండ్ (PF) సభ్యులకు దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సన్నాహాలు చేస్తోంది. EPFO వెర్షన్ 3.0 ను దీపావళి నుంచి అమలు చేసేందుకు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం.
EPFO Update: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ అయిన ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిలాకర్ లో ఈపీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీంతో మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ను ఏ సమయంలోనైనా..ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO News: ఈపీఎఫ్ లో పేరు పుట్టిన తేదీ వంటి తదితర వివరాలు మార్చుకోవడం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPFO ATM Money Withdrawal: ద్యోగ భవిష్య నిధికి సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక అప్ డేట్ రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల విత్ డ్రా మరింత సులభం కానుంది. ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఐటీ సిస్టమ్స్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ దానికి బ్యాంకు డెబిట్ కార్డు ఇస్తారా లేదా ప్రత్యేకం కార్డు ఇస్తారా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO CBT Meeting: ఈపీఎఫ్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాలపై అధికవడ్డీ లభించనుంది. ఎందుకంటే సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈఫీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని పీఎఫ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
EPFO Bonus Facility: ఉద్యోగం చేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ పెద్ద ప్రకటన చేసింది. దీనిలో కొన్ని షరతులు పాటిస్తే అతనికి రూ. 50వేల బోనస్ అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీ ఖాతాలో జమా అయింది ఎలా తెలుసుకుంటారు. ఉద్యోగుల సౌకర్యార్ధం ఈపీఎఫ్ఓ కొన్ని విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్క మిస్ట్ కాల్ ఇస్తే చాలు ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.