Tamilnadu New Governor: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు ఇటీవల జరిగిన కీలక మార్పులు. తమిళనాడుకు కొత్త గవర్నర్ నియామకమయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంబంధిత ఉత్తర్వుల్ని జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు గవర్నర్‌గా మాజీ కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్‌(Ravi sankar prasad)ని నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి వరకూ కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రిగా చేసిన రవి శంకర్ ప్రసాద్..కేంద్ర కేబినెట్ విస్తరణ (Union cabinet Extension) నేపధ్యంలో రాజీనామా చేశారు.కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొంతమంది మంత్రుల్ని తొలగించి..గవర్నర్లుగా నియమించారు. ఈ క్రమంలో రవిశంకర్ ప్రసాద్ కేంద్ర మంత్రి నుంచి తమిళనాడు గవర్నర్‌గా నియామకమయ్యారు. ఇప్పటివరకూ తమిళనాడు(Tamilnadu) గవర్నర్‌గా బన్వర్ లాల్ పురోహిత్ వ్యవహరించారు. ఇటీవల 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. ఇందులో భాగంగా ఏపీకు చెందిన కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించగా..బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్‌గా నియమించారు. 


Also read: AYUSH training for MBBS interns: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు ఆయుష్‌లో ట్రైనింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook