Export Of Onions from January 1st: జనవరి 1 నుంచి ఎన్నో విషయాలు మారనున్నాయి. కొత్త రూల్స్ సైతం అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం (డిసెంబర్ 28న) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నెలలో విధించిన ఎగుమతలపై ఆంక్షలు తొలగిపోనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం నుంచి అంటే జనవరి 1 నుంచి ఉల్లిపాయలు(Onions)ను ఏ ఆంక్షలు లేకుండా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని తమ నోటిఫికేషన్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పేర్కొ్ంది. ఉల్లిధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మూడు నెలల కిందట ఉల్లిపాయ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం తెలిసిందే.   


Also Read: Sapota Benefits: సపోటా తింటున్నారా.. ఈ విషయాలు మీకు తెలుసా!



కొత్త పంట చేతికొస్తున్న నేపథ్యంలో ఉల్లిగడ్డ ధరలు నియంత్రణలో ఉండనున్నాయని, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇటీవల ఎగుమతులపై ఇచ్చిన ఉత్తర్వులతో పాటు నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచే ఉల్లి ఎగుమతులకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ నెలలో ఢిల్లీ(Delhi) మార్కెట్‌లో రూ.70గా ఉన్న ఉల్లిపాయ ధరలు ప్రస్తుతం రూ.40కి దిగొచ్చాయి. 


Also Read: ​Cold Moon 2020 Date And Timings: అరుదైన ఫుల్ మూన్ 2020.. కనువిందు చేయనున్న చందమామ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook