Weather Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..మరోమారు భారీ వర్ష సూచన..!
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తాజా వెదర్ రిపోర్ట్‌ను ఇప్పుడు చూద్దాం..
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు కురువనున్నాయి. నిన్న దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం..వాయవ్య దిశగా కదిలి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇవాళ దక్షిణ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం సుమారు వాయవ్య దిశగా కదిలి రాగల 48 గంటల్లో మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇటు కింది స్థాయిలోని గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంపై వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు, ఎల్లుండి అక్కడక్కడ కుండపోత వానలు పడనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ రేపు ఈదురుగాలులు సైతం ఉండనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి.
మరోవైపు ఏపీలోనూ ఇలాంటి వాతావరణం ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం దాదాపు వాయవ్య దిశగా కదిలి..మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీన పడింది. తీవ్ర అల్పపీడనము మధ్యప్రదేశ్ మీదుగా వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. రుతు పవన ద్రోణి సగటు సముద్ర మట్టానికి జైసల్మేర్, ఉదయపూర్, భోపాల్, ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది.
అల్పపీడనం గుండా ప్రయాణిస్తూ..భటపరా, ఝర్సుగూడ, బాలాసోర్..అక్కడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇటు ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానంలో ఇవాళ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు తెలిపాయి.
దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పేర్కొంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ముసురు పట్టుకుంది. భారీ వర్షాలతో నదులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లి ప్రవహిస్తున్నాయి.
Also read:సైమా అవార్డ్స్ 2022లో మెరిసిన పూజా హెగ్డే.. 'మేడమ్ సర్ మేడమ్ అంతే'..!
Also read:కృష్ణంరాజు పార్ధివ దేహానికి ప్రభాస్ తలకొరివి పెట్టడం లేదు.. పెట్టేది ఎవరంటే?
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి