Pooja Hegde SIIMS Award 2022: సైమా అవార్డ్స్ 2022లో మెరిసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలు 'మేడమ్ సర్ మేడమ్ అంతే'..!

Actress Pooja Hegde looks stunning in pink gown at SIIMA Awards 2022. 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ 2022లో మెరిశారు. ఈ ఫోటోలలో పూజా పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 02:44 PM IST
  • సైమా అవార్డ్స్ 2022లో మెరిసిన పూజా హెగ్డే
  • 'మేడమ్ సర్ మేడమ్ అంతే
  • పూజా హెగ్దే అందాల విందు
Pooja Hegde SIIMS Award 2022: సైమా అవార్డ్స్ 2022లో మెరిసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలు 'మేడమ్ సర్ మేడమ్ అంతే'..!

Pooja Hegde looked lovely in a pink gown at SIIMA Awards 2022: 'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి. 

వరుస డిజాస్టర్స్ పడినా పూజా హెగ్దేకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. మూవీలో పూజా ఎంపికయ్యారు. అలానే మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీలోనూ నటించనున్నారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ 2022లో మెరిశారు. ఈ ఫోటోలలో పూజా పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్నారు. 

Also Read: కోడి గుడ్లను మింగిన కింగ్ కోబ్రా.. డబ్బులు ఇచ్చి మరీ ప్రజల నుంచి రక్షించాడుగా!

Also Read: ఇదేం ఫీల్డింగ్ రా సామీ.. సింపుల్ క్యాచ్‌ను సిక్సర్‌ ఇచ్చారుగా! పాక్ ఫీల్డర్స్‌తో అట్లుంటది మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News