Fact Check: భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6వ తేదీన మహాపరినిర్వాన్ దివస్‌ను జరుపుకున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి.ఇంతలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫోటోతో పాటు ఆడియో క్లిప్ వైరల్ గా మారింది.  1931లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ వాయిస్ ఈ క్లిప్‌లో ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం బయటకు వచ్చింది. నిజానికి ఆ ఆడియో క్లిప్ అంబేద్కర్ ఉన్న ఫొటోతో జత చేశారు. ఎక్స్ లో సుభాష్ దేశాయ్ అనే వ్యక్తి ఈ క్లిప్ ను షేర్ చేశాడు. ఇదే నిజం అనుకుని చాలా మంది ఈ ఆడియోను షేర్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ ఆడియో వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఆ ఆడియో క్లిప్ ఫేక్ అని తేలింది. ఎందుకంటే 1931నాటి ఆడియో ఇంత క్లియర్ ఉండే అవకాశం లేదు. మ్యూజిక్ వచ్చే అవకాశం అస్సలు ఉండదు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా క్లిప్ స్టార్టింగ్ ఉపయోగించిన ఇమేజ్ మరొక రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించింది. భారతదేశంలో అణగారిని వర్గాల ద్రుక్కోణాన్ని మీ ముందు ఉంచేందుకు నా సహోద్యోగి రావు బహదూర్ శ్రీనివాసన్ పై నాకు గౌరవం ఉంది అనే క్లిప్ లో వినిపించిన టెక్ట్స్ పై గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేస్తే..1930 నవంబర్ 20వ తేదీన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఐదవ సమావేశం ప్లీనరీ సెషన్ లోని ప్రసంగమని ఓ వెబ్ సైట్ సూచించింది. 


 




దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు వాల్యూమ్2అనే పుస్తకంలో ఈ ప్రసంగం గురించి చూడవచ్చు. 529వ పేజీలో శీర్షిక ప్రాస్తవించారు.ఐదవ సమావేశం నవంబర్ 20, 1930. ఇదే కీవర్డ్ సెర్చ్ ను యూట్యూబ్ లో 2000లో విడుదలైన సినిమాకు సంబంధించిన ఆడియో అని తేలింది. ఈ సినిమాకు జబ్బర్ పటేల్ డైరెక్టర్. అంతేకాదు బీబీసీ న్యూస్ ఇండియా న్యూస్ ఛానెల్లో అప్ లోడ్ చేసిన బీబీసీ న్యూస్ తో అంబేద్కర్ ఇంటర్య్వూ..ఈ ఆడియో ఇంటర్వ్యూ 1955 నాటిది. ఇంటర్వ్యూలో వినిపించిన ఆడియోకు, వైరల్ క్లిప్ లో షేర్ చేసిన ఆడియోకు చాలా తేడా ఉంది. 


[[{"fid":"405589","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మొత్తానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్ సినిమా ఆడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. 1931లో లండన్ లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బాబా సాహెబ్ అంబేదర్క్ అసలు వాయిస్ ఇందులో ఉందని వాదిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ లో ఇది తప్పు అని తేలింది. 



 



 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook