Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా
Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, పెన్షనర్ల కుటుంబంలో కుమార్తెకు అర్హత ఉంటుందా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్‌కు కుటుంబ యజమాని కుమార్తెకు పేరు చేర్చడం లేదా తొలగించే అంశమై వివరణ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ వివరాల నుంచి కుమార్తె పేరును తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించి పెన్షన్ శాఖ నుంచి మెమొరాండం జారీ అయింది. ఫ్యామిలీ పెన్షన్ కొత్త నిబంధనలు విడుదలయ్యాయి. ఇందులో కూతుళ్లకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుందా లేదా అనేది మరోసారి స్పష్టమైంది.
సీఎస్ఎస్ పెన్షన్ రూల్స్ 2021 రూల్ నెంబర్ 50 ( 15) ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరిన తరువాత కుటుంబ వివరాలను ఫారం 4లో సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, వికలాంగులైన తోబుట్టువుల వివరాలు ఇవ్వవచ్చు. సదరు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే ముందు పెన్షన్ పత్రాలతో పాటు అప్‌డేట్ చేసిన కుటుంబ సభ్యుల వివరాలు మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యుల వివరాల నుంచి కుమార్తె పేరు తొలగించడంపై వివరణ కోరుతూ ఎంక్వైరీలు వచ్చాయని పెన్షన్ల శాఖ జారీ చేసిన మెమొరాండంలో ఉంది. అందుకే పింఛన్ పొందేందుకు అర్హులైనా కాకపోయినా కుటుంబసభ్యుల వివరాలు అన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఇలా నిర్దేశిత ఫారం రూపంలో సమాచారం అందించినప్పుడు కుమార్తెను కూడా ప్రభుత్వోద్యోగి కుటుంబంలో సభ్యురాలిగానే పరిగణించాలి. నిబంధనల ప్రకారం ఫ్యామిలీ పెన్షనర్ మరణానంతరం కుటుంబ పెన్షన్ ఎవరికి వర్తిస్తుందో నిర్ణయిస్తారు.
ఫ్యామిలీ పెన్షన్‌లో మొదటి హక్కు ఎవరికి ఉంటుంది
పెన్షనర్ మరణించినప్పుడు భార్యకు పెన్షన్ అందిస్తారు. జీవిత భాగస్వామి లేకపోతే పిల్లలకు ఇస్తారు. 25 ఏళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలకు లేదా వివాహం అయ్యేంతవరకు పిల్లలకు లేదా ఉద్యోగి పిల్లల నెలవారీ జీతం 9 వేల కంటే తక్కువ ఉన్నప్పుడు ఉద్యోగి పిల్లలకు పెన్షన్ చెల్లించనున్నారు. సదరు ఉద్యోగి కుమారుడు లేదా కుమార్తె మానసిక వికలాంగులు లేదా శారీరక వైకల్యంతో ఉంటే 25 ఏళ్లు దాటిన తరువాత కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వవచ్చు. ఇందులో షరతులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగికి వికలాంగ పిల్లలుంటే పెన్షన్ మొదటి హక్కు వారికే ఉంటుంది. కుమార్తె తండ్రిపై ఆధారపడినా సరే ఆ కుమార్తెకు పెన్షన్ అందించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.