Delhi Chalo farmers protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ( Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం భారత్ బంద్ అనంతరం ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) రంగంలోకి దిగారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం.. ఇటు రైతు సంఘాలు పూర్వ వాదనలకే కట్టుబడటంతో ఈ చర్చలు కూడా ఫలించలేదు. దీంతోపాటు ఈ రోజు జరగాల్సిన ఆరో రౌండ్ చర్చలు కూడా రద్దయ్యాయి. అయితే.. ఈ రోజు ప్రభుత్వం పంపిచే సవరణల ప్రతిపాదనలను పరిశీలించి 12గంటలకు కార్యచరణను ప్రకటిస్తామని రైతు సంఘాల నాయకులు.. షాతో భేటీ అనంతరం వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం రాత్రి 9గంటలకు హోంమంత్రి అమిత్ షా.. 13 రైతు సంఘాల నాయకులతో పూసా ఏరియాలోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశమయ్యారు. 13 మందిలో 8మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా.. మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందిన నేతలున్నారు. ఈ సమావేశంలో కూడా చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు స్పష్టంచేశారు. ఈ చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని, వాటిలో ఎలాంటి సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా రైతు సంఘాల ప్రతినిధులకు సూచించారు. నేతలు చెప్పిన 39 అభ్యంతరాలనూ పరిశీలించామని, ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయదలిచిందన్న ప్రతిపాదనలను సింఘు సరిహద్దుకు పంపిస్తామని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా తెలిపారు. దీనికి రైతు సంఘాల నేతలు అంగీకరించారు. Also read: Bharat Bandh: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధం


అనంతరం సమావేశం నుంచి బయటకు వచ్చిన రైతు సంఘాల నేతలు ఈ రోజు జరిగే చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సవరణల ప్రతిపాదనలు తమకు అందిన తర్వాత రైతు సంఘాలన్ని కలిసి భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తాయని వెల్లడించారు. ఇదిలాఉంటే.. మంగళవారం జరిగిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. నేటితో రైతుల నిరసనలు 14వ రోజుకు చేరాయి. Also read: Farmer protests: రైతు సంఘాలతో భేటీ కానున్న హోంమంత్రి అమిత్ షా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook