Farmers Body Announces 3 days Rail Roko: న్యూఢిల్లీ: ఎన్డీయే (NDA) ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులు, వ్యవసాయ రంగ ఉత్తత్తులకు సంబంధించిన బిల్లుల (Agricultue Bills) పై విపక్ష పార్టీలన్నీ కేంద్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ (Harsimrat Kaur Badal) కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన రైతులు, వ్యవసాయ సంఘాలు.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు ‘రైల్ రోకో’కు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో రైల్ రోకో నిర్వహించనున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రెటరీ సర్వాన్ సింగ్ పంధేర్ ప్రకటించారు. Also read: Harsimrat Kaur Badal: కేంద్ర మహిళా మంత్రి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ రైతు వ్య‌తిరేక బిల్లుల‌కు వ్య‌తిరేకంగా హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ త‌న‌ కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయగా.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ దానిని ఆమోదించారు. అయితే హర్‌సిమ్రత్ కౌర్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంద‌ని కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ర్ష్ క‌మిటీ కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని ఏమాత్రం శాంతపర్చలేదన్నారు. ఇదే విషయాన్ని శిరోమ‌ణి అకాలీద‌ల్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ గ్ర‌హిస్తే.. లక్షలాది మంది రైతులతో పార్ల‌మెంటును ఘెరావ్ చేయాలని ఆయన సూచించారు.   Also read: Ashok Gasti: కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత


ఇదిలాఉంటే.. ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు సెప్టెంబర్ 25 న ' భారత్ బంద్' కు పిలుపునిచ్చాయి. పంట ఉత్ప‌త్తుల‌ను రైతుల నుంచి ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌కుండా.. ప్ర‌భుత్వం కొత్తగా బిల్లుల‌ను రూపొందించింద‌ని అన్నీ పార్టీలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. వ్యవసాయం, రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (AIKSCC) పిలుపునిచ్చింది. Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం