Gujarat government to provide financial assistance to farmers for purchasing a smartphone: రైతుల కోసం గురజరాత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రైతులు స్మార్ట్​ఫోన్​ కొనేందుకు రూ.15 వందలు ఆర్థిక సహాయం (Gujarat financial assistance to farmers) అందించనున్నట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సబ్సిడీ ఎందుకు?


వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. రైతులకు ఆ సేవలు అందించాలని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే రైతులు స్మార్ట్​ఫోన్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.


ఎవరు కొనొచ్చు?


గుజరాత్​లో భూమి ఉన్న ఏ రైతు అయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని (Gujarat smartphones scheme) వ్యవసాయ శాఖ నోటిఫికేషన్​లో పేర్కొంది. స్మార్ట్​ఫోన్ విలువలో 10 శాతం మించకుండా.. రూ.1,500 వరకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇందుకోసం ముందుగా i-khedut portalలో రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


ఇది స్మార్ట్​ ఫోన్​కు మాత్రమే వర్తిస్తుందని కూడా గుజరాత్ వ్యవసాయ, రైతు సంక్షేమ, సహకార విభాగం పేర్కొంది. ఇయర్​ ఫోన్స్​, ఛార్జర్లు, పవర్​ బ్యాంక్​ వంటి వాటికి వర్తించదని స్పష్టం చేసింది.


అప్లికేషన్​నుకు అమోదం లభించిన తర్వాత.. లబ్ధిదారుడు.. స్మార్ట్​ఫోన్​ ఐఎంఈఐ నంబరు, మొబైల కొనుగోలు బిల్లును, ఒక క్యాన్సిల్​ చెక్కును ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని నోటిఫికేషన్​లో పేర్కొంది (Gujarat farmers scheme) ప్రభుత్వం.


Also read: యూపీ: పెళ్లైన 9 నెలలకు..భార్య నల్లగా ఉందని తలాక్ చెప్పేశాడు..!


Also read: ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన మహిళ


ప్రభుత్వం లక్ష్యం ఇదే..


రైతుల వద్ద స్మార్ట్​ఫోన్ ఉంటే.. వాతావరణ సమాచారం, పంట తెగుళ్లకు చెందిన సమాచారంతో పాటు.. వ్యవసాయ శాఖ అందించే వివిధ పథకాలన నేరుగా రైతులకు చేరవేయొచ్చని భావిస్తోంది గుజరాత్ ప్రభుత్వం. దీనితో పాటు.. నిపుణుల సలహాలు, సూచనలను కూడా అందించడం సులభమవుతుందని అభిప్రాయపడుతోంది.


Also read: ప్రియమైన ప్రధానమంత్రి గారు.. రైతులకు క్షమాపణలు మాత్రమే సరిపోవు : ప్రకాష్ రాజ్


Also read: వైరల్: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ఫోన్ చేసిన ప్రియురాలు....తర్వాత ట్విస్ట్ మామూలుగా లేదుగా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook