Farmers Protest: రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళన 3 వందల రోజులకు చేరింది. లక్షలాదిమంది రైతులు దాదాపు ఏడాదిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతు చట్టాలు వెనక్కి తీసుకునేవరకూ ఆందోళన ఆగేది లేదంటున్నారు రైతు సంఘాల నేతలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం(Central government)తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల వద్ద చేపట్టిన నిరసన దీక్ష దాదాపు ఏడాదిగా జరుగుతోంది. రైతులు నిరసన చేపట్టి 3 వందలరోజులు పూర్తయింది. లక్షలాదిమంది రైతుల ఆవేదనను తమ నిరసనలు ప్రతిబంబిస్తున్నాయని సంయక్త కిసాన్ మోర్చ వెల్లడించింది. రైతుల్ని ఢిల్లీ సరిహద్దులకు చేర్చి 3 వందల రోజులైందంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రైతుల నిరసన శాంతియుతంగానే జరుగుతోందని కిసాన్ మోర్చ నేతలు తెలిపారు. రైతుల డిమాండ్లు ఏంటనేది మోదీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఏ ఎన్నికల్లోనైనా రైతుల ఓట్లతోనే గెలుస్తున్నారనేది గుర్తుంచుకోవాలన్నారు. కొత్త రైతు చట్టాలకు(New Farm Laws) వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన భారత్ బంద్ జరగనుంది.


Also read: Vaccination Certificate: ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌పై బ్రిటన్ అనుమానాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook