Vaccination Certificate: ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌పై బ్రిటన్ అనుమానాలు

Vaccination Certificate: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సమస్య లేదని..ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌తోనే అసలు సమస్యను బ్రిటన్ కొత్త వాదన అందుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2021, 09:25 AM IST
  • ఇండియా బ్రిటన్ మధ్య ఇంకా కొలిక్కిరాని వ్యాక్సిన్ సమస్య
  • ప్రయాణ ఆంక్షల్లో కోవిషీల్డ్ చేర్చిన బ్రిటన్ ప్రభుత్వం
  • కోవిషీల్డ్‌తో సమస్య కాదని..సర్టిఫికేట్ పైనే అనుమానాలని తేల్చిన బ్రిటన్
Vaccination Certificate: ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌పై బ్రిటన్ అనుమానాలు

Vaccination Certificate: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సమస్య లేదని..ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌తోనే అసలు సమస్యను బ్రిటన్ కొత్త వాదన అందుకుంది.

భారత్ సహా కొన్ని దేశాలపై రాకపోకల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం(Britain government) అక్టోబర్ 4 నుంచి అమలయ్యేలా కొత్త ఆంక్షలు విధించింది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేర్చకపోవడంతో పెద్దఎత్తున దుమారం చెలరేగింది. విదేశీ ప్రయాణాల విషయంలో బ్రిటన్ దేశం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను చేర్చకపోవడంపై ఇండియా తీవ్ర విమర్శలే చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా(Oxford-AstraZeneca) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌నే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు..ఆ వ్యాక్సిన్‌ను ఎందుకు తిరస్కరించారంటూ ప్రశ్నించింది.

దాంతో బ్రిటన్ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేసి..మరోసాలి మెలిక పెట్టింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను(Covishield Vaccine)జాబితాలో చేరుస్తూ..నిబంధనల్ని సవరించింది. అయితే కోవిషీల్డ్(Covishield)తీసుకున్నా సరే ప్రయాణీకులు పదిరోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదని..కేవలం ఇండియా జారీ చేసే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌పైనే అనుమానాలున్నాయని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికేట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)నిబంధనలకు అనుగుణంగా లేదని తెలిపింది. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నా..క్వారంటైన్ (Quarantine)నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. ఇండియా మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగానే సర్టిఫికేట్లు జారీ చేస్తున్నామని పేర్కొంది.

Also read: UK New Travel Rules: యూకే జాతి వివక్ష, ఇండియా సహా కొన్ని దేశాలపై కొత్త ట్రావెల్ ఆంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News