ఆర్టికల్ 370 ( Article 370 ) విషయంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ( Farooq Abdullah ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ పునరుద్ధరణకు చైనా సహాయం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.  మోదీ తీసుకున్న చర్యకు మద్దతిచ్చేవారిని దేశద్రోహులుగా అభివర్ణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి యేడాది పూర్తయింది. ఇప్పుడీ విషయంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడైన ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి. ఎందుకంటే కేవలం ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించే మాట్లాడకుండా...ఈ విషయంలో చైనా ( China ) సహాయం చేస్తుందనడం వివాదానికి కారణమవుతోంది. 


స్థానిక మీడియాతో మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో చైనా సహాయపడగలదన్నారు. అంతేకాకుండా...ఆర్టికల్ 370 పై మోదీ ( Modi ) తీసుకున్న చర్యను సమర్ధించేవారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. చైనా విషయానికొస్తే, తానెప్పుడూ చైనా అధ్యక్షుడిని ఇక్కడకు పిలువలేదని..తమ ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడిని గుజరాత్‌కు పిలిచి ఉయ్యాలపై కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. అక్కడ్నించి చెన్నైకి తీసుకెళ్ళి చాలా తినిపించాన్నారు.  గత ఏడాది ఆగస్టు 5 న కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కానేకాదని... దీనికి పాకిస్తాన్‌, చైనా ప్రభుత్వాలు వ్యతిరేకించాయని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు.


పార్లమెంటులో కూడా జమ్ముకశ్మీర్ సమస్యలపై మాట్లాడటానికి అనుమతించలేదని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏతో కలిపి జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు.జమ్ముకశ్మీర్‌లో 2019 ఆగస్టు 5 కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని ఫరూక్‌ అబ్దుల్లా డిమాండ్ చేశారు. Also read: Bihar Elections 2020: బీహార్ ఎన్నికల్లో స్టార్ క్యాంపేనర్స్ వీరే!