FASTag: కొత్త ఏడాది అన్నీ కొత్తగానే ఉండబోతున్నాయి. అందులో ఒకటి ఫాస్టాగ్. అయితే చాలామందికి ఫాస్టాగ్‌కు సంబంధించి చాలా సందేహాలుంటున్నాయి. ఆ సందేహాలేంటి..సమాధానమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కొత్త ఏడాదిలో అంటే 2021 జనవరి 1 నుంచి వాహనదారులు జాతీయ రహదార్ల ( National Highways )పై వెళ్లాలంటే ఫాస్టాగ్ ( FASTag ) తప్పనిసరి. లేకుంటే నో ఎంట్రీ, నో ఎగ్జిట్. టోల్ గేట్ ( Tollgate ) ఫీజు ఫాస్టాగ్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర రహదార్లు, రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫాస్టాగ్ మ్యాండేటరీ అయింది. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఈ ఫాస్టాగ్ విషయంలో ఎదురవుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలివే..


ఫాస్టాగ్ కాల పరిమితి


జాతీయ రహదార్లపై టోల్ ప్లాజాల ( Toll plaza ) వద్ద రద్దీ తగ్గించేందుకు, గంటల తరబడి నిరీక్షణ లేకుండా చేసేందుకు ఫాస్టాగ్ ప్రవేశపెట్టారు. దీనిద్వారా డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించినట్టవుతుంది. ఫాస్టాగ్ అంటే ఓ వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన బార్ కోడ్. బార్‌కోడ్ను వాహనం అద్దం లేదా సైడ్ మిర్రర్‌పై అంటిస్తారు. జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది. 


Also read: Tamil nadu: మూడవ కూటమి కోసం కమల్ హాసన్ ప్రయత్నాలు


ఫాస్టాగ్ పనిచేసే విధానం


వాహనం టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినప్పుడు పై భాగంలో ఉండే యంత్రం బార్‌కోడ్‌ ( Bar code ) ను ఆటోమేటిక్‌గా రీడ్ చేసి స్కాన్ చేస్తుంది. బార్‌కోడ్‌కు అటాచ్డ్‌గా ఉండే పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ ( Digital payment ) నుంచి టోల్‌ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దాంతో డబ్బులు ఇచ్చిపుచ్చుకునే సమయం అంతా కలిసొస్తుంది. చిల్లర సమస్య కూడా తీరుతుంది.


Also read: Income tax: టాక్స్ పేయర్లకు ఇన్‌కంటాక్స్ విభాగం హెచ్చరిక..ఇలాంటి మెస్సేజ్‌ల పట్ల జాగ్రత్త


ఫాస్టాగ్ ఎలా కొనాలి


ఫాస్టాగ్ కొనాలంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా KYC ప్రక్రియ ( Kyc Process ) పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ పత్రం, వ్యక్తిగత గుర్తింపు కార్డు అందించాలి. పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ వాలెట్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి. వీటిలో వివరాలు నమోదు చేసి..సంబంధిత కేవైసీ పత్రాలతో ఫాస్టాగ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయితే ఇంటికి ఫాస్టాగ్ స్టిక్కర్ డెలివరీ అవుతుంది. 


ఫాస్టాగ్ ప్రయోజనాలు..లభ్యమయ్యే ప్రదేశాలు


ఫాస్టాగ్ స్టిక్కర్ ఇంటికి డెలివరీ అవుతుంది. బ్యాంకులు, ఈ కామర్స్ ఛానెల్ ఉన్న పలు ఏజెన్సీలతో ప్రభుత్వం భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి ( HDFC Bank ) , ఐసిఐసిఐ ( ICICI Bank ) , ఎస్బీఐ (SBI ), కోటక్ బ్యాంక్ ( Kotak Bank ), యాక్సిక్ బ్యాంక్ ( Axis Bank ), బ్యాంక్ ఆఫ్ బరోడా ( Bank of Baroda )లు ఫాస్టాగ్‌లు అందిస్తున్నాయి. ఇవి కాకుండా డిజిటల్ పేమెంట్ సంస్థలు, టోల్‌ప్లాజాల్లో అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డిజిటల్ పేమెంట్ సంస్థ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో రీఛార్జ్ చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్లు ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్ విధానం ద్వారా నగదు చెల్లింపుల నిమిత్తం టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఫలితంగా సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి.


Also read; Ashwini Kumar Choubey: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్