Income tax: టాక్స్ పేయర్లకు ఇన్‌కంటాక్స్ విభాగం హెచ్చరిక..ఇలాంటి మెస్సేజ్‌ల పట్ల జాగ్రత్త

Income tax: ఇన్‌కంటాక్స్ రిఫండ్ కోసం చాలామంది మోసపోతుంటారు. సైబర్ క్రైమ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇన్‌కంటాక్స్ శాఖ టాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రిఫండ్ కోసం వచ్చే ఇలాంటి మెస్సేజ్‌లు లేదా ఈ మెయిల్‌లను ఓపెన్ చేయవద్దని అంటోంది. ఒకవేళ చేస్తే..మీ అక్కౌంట్ హ్యాక్ కావచ్చంటోంది.

  • Dec 29, 2020, 14:37 PM IST

Income tax: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్  దాఖలు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31 2020. అంటే మీకింకా కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలుంది. ఒకవేళ మీరు ఐటీఆర్ ఇప్పటివరకూ ఫైల్ చేయకపోతే చేసేయండి. కానీ మేం మీకు చెప్పేంది ఐటీఆర్ రిటర్న్స్ కోసం కాదు..రిఫండ్ ఉచ్చులో పడి మోసానికి గురయ్యే అవకాశాల గురించి. ఫేక్ మెస్సేజ్‌లు, ఫేక్ ఈ మెయిల్‌లపై ఇన్‌కంటాక్స్ శాఖ అప్రమత్తత జారీ చేసింది.

1 /5

ఒకవేళ మీకు అలాంటి ఈ మెయిల్ , మెస్సేజ్ వస్తే..ఆ ఈ మెయిల్‌ను మీరు webmanager@incometax.gov.in కు పంపించండి. తరువాత incident@cert-in.org.in కు పంపించవచ్చు. ఇదొక సైబర్ ఫ్రాడ్. వీటిపై వెంటనే ఫిర్యాదు చేయాలి. 

2 /5

ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌పై ఇచ్చిన లింక్‌లో..టాక్స్ పేయర్లు ఫిర్యాదు చేయవచ్చు. నకిలీ రిఫండ్ ఈమెయిల్ లేదా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించవచ్చు. ఇన్‌కంటాక్స్ శాఖ ఈ మెయిల్ ద్వారా టాక్స్ పేయర్ల నుంచి ఏ విధమైన వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. దాంతోపాటు ఈ మెయిల్ ద్వారా టాక్స్ పేయర్లను..పిన్, పాస్‌వర్డ్ లేదా క్రెడిట్ కార్డు, బ్యాంకు, ఇతర ఆర్ధిక ఖాతాల సమాచారం అడగదు. 

3 /5

వాస్తవానికి ఇలా ప్రతియేటా జరుగుతుంటుంది. ఐటీఆర్ భర్తీ చేసే గడువు తేదీ సమీపించినప్పుడు మోసగాళ్లు చెలరేగిపోతుంటారు. ఇన్‌కంటాక్స్ శాఖ పేరుతో టాక్స్ పేయర్లకు మెస్సేజ్‌లు పంపించి..రిఫండ్ ఇప్పిస్తామని ఆశ చూపిస్తారు. టాక్స్ పేయర్లకు ఓ లింక్ పంపిస్తారు. దీనికోసం సంబంధిత వ్యక్తి సమాచారాన్ని సేకరిస్తారు. మీరు ఒకవేళ లింక్ క్లిక్ చేస్తే..బ్యాంకింగ్ డీటైల్స్ సమర్పిస్తే..మీ బ్యాంక్ అక్కౌంట్ హ్యాక్ అయిపోతుంది. ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది. 

4 /5

టాక్స్ పేయర్లు జాగ్రత్త..రిపండ్ ఇస్తామని చెప్పే ఏ విధమైన నకిలీ లింక్‌లను క్లిక్ చేయవద్దు. ఇలాంటి మెస్సేజ్‌లను లేదా లింక్‌లను ఎప్పుడూ ఐటీ శాఖ పంపించదు. ఏదైనా సరే మీ ఈ ఫైలింగ్ ఖాతాలో లాగ్ ఇన్ అవడం ద్వారా మాత్రమే అవుతాయి. ఎప్పుడూ ఈ మెయిల్ లేదా లింక్, లేదా మెస్సేజ్‌ను క్లిక్ చేయవద్దు.

5 /5

ఇన్‌కంటాక్స్ రిఫండ్‌కు సంబంధించి వచ్చే ఏ విధమైన మెస్సేజ్‌లను నమ్మవద్దని ఇన్‌కంటాక్స్ శాఖ సలహా ఇస్తోంది. ఇన్‌కంటాక్స్ రిఫండ్ పేరుతో వచ్చే నకిలీ లింక్‌లను క్లిక్ చేయవద్దని ఐటీ శాఖ చెబుతోంది. ఎందుకంటే ఇలాంటి మెస్సేజ్‌లు లేదా లింక్‌లు టాక్స్ పేయర్లను మోసానికి గురి చేస్తాయి.