షాకింగ్ న్యూస్: FB ఫ్రెండ్ ను హతమార్చి..ఆపై ఆత్మహత్య
ఫేస్ బుక్ లో యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు... ఆమె మరెవరితోనో తిరుగుతోందన్న అనుమానంతో ఆమెను కాల్చి చంపాడు.. అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
చెన్నై సమీపంలోని విల్లుపురానికి చెందిన కార్తివేలు ఏర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి మెడిసిన్ చదువుతున్న సరస్వతి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడి..క్రమంగా అది ప్రేమగా మారింది. గత కొంత కాలంగా సరస్వతి తనకు దూరమవుతూ.. మరెవరికో దగ్గరవుతోందని భావించిన కార్తివేలు.. సర్వస్వతిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సరస్వతి పుట్టిన రోజురాగా వేడుకల్లో పాల్గొన్న కార్తివేలు ఆమెతో గొడవకు దిగాడు.. ఆపై వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరుగగా తుపాకితో సరస్వతిని కాల్చిచంపిన కార్తివేలు ..ఆపై తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేస్ బుక్ లో పరిచయం.. ఆపై స్నేహం.. ఆ స్నేహం కాస్త ప్రేమ ఇలాంటి ఘటనలు తరచూ ఎన్నో చూస్తున్నాం. ఫేస్ బుక్ పరిచయాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయని చెప్పడానికి ఈ ఘటనే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో యువత ఫేస్ బుక్ పరిచయాలని సీరియస్ గా తీసుకోవద్దనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.