Fodder scam Case: దాణా కుంభకోణం కేసులో (Fodder scam) బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు (Lalu Prasad Yadav) రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు (Ranchi special CBI court) సోమవారం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 60 లక్షల రూపాయల జరిమానా విధించింది. దాణా స్కామ్ కు సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఐదో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఈనెల 15న దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. జార్ఖండ్‌లోని డోరాండా ట్రెజరీ (Doranda Treasury) నుంచి రూ.139 కోట్లకు పైగా మోసపూరితంగా విత్‌డ్రా చేసినందుకు అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో లాలూతో పాటు మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి బెక్ జూలియస్, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కేఎం ప్రసాద్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.


అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 24 మంది నిందితులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కోర్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను హోత్వార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. లాలూ యాదవ్‌తో పాటు మిగిలిన 99 మంది నిందితులను భౌతికంగా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌కే శశి గతంలో ఆదేశించారు. జార్ఖండ్‌ ఏర్పాటుకు ముందు బీహార్‌ ముఖ్యమంత్రిగా లాలూ యాదవ్‌ ఉన్నప్పుడు ఈ స్కామ్‌ జరిగింది.


1996 జనవరిలో ఈ దాణా కుంభకోణం (fodder scam) వెలుగులోకి వచ్చింది. అప్పటి బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్​ యాదవ్ ఉన్నారు. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్​లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అతనితోపాటు బీహార్ మాజీ సీఎం జగన్నాథ్​ మిశ్రాపైనా సీబీఐ అభియోగాలు మోపింది. ఈ స్కామ్ కు సంబంధించి 15 ఏళ్లలో 565 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. ఆరుగురు పరారీలో ఉండగా.. 55 మంది మరణించారు. 


Also Read: Priyanka Gandhi: సామాన్యులకు సేవ చేయడం బీజేపీ ఎప్పుడో మరిచిపోయింది.. వారి కోసం మాత్రమే పనిచేస్తోంది: ప్రియాంక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook