Last Video of CDS Helicopter: చీఫ్​ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​ (సీడీఎస్​) జనరల్​ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ విమానం.. నిన్న తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్​ సమీపంలో కుప్పకూలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సీడీఎస్​ బిపిన్​ రావత్​ తంపతులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.


సరిగ్గా హెలికాప్టర్ కుప్పకూలే కొన్ని క్షణాల ముందు ఎలా ఉందో ఈ వీడియో ద్వారా వెల్లడైంది. మేఘాలు నిండుగా కమ్ముకున్నట్లు ఇందులో కనిపించింది. మేఘాల్లోంచి దూసుకెళ్లిన కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలించకనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు పలువురు ఈ వీడియోను చూసి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


హెలికాప్టర్ కూలిన స్థలానికి కాస్త దూరంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రికరించారు. ఆ దృశ్యాలను మీరు చూడండి.




Also read: BlackBox: బిపిన్ రావత్ హెలీకాప్టర్ బ్లాక్‌బాక్స్ ఎక్కడ, అందులో ఏముంది


Also read: General Naravane: తదుపరి సీడీఎస్​గా ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook