'కరోనా వైరస్' ఆర్థిక వ్యవస్థను కమ్మేస్తోంది. దేశవ్యాప్తంగా 54 రోజులపాటు విధించిన లాక్ డౌన్ 3.0 కొనసాగుతోంది. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ బంద్ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాదు ఇప్పటికీ సమస్య సమసిపోలేదు.  లాక్ డౌన్ 4.0 కూడా ఉంటుందని నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.  కానీ ఇప్పటి వరకు విధించిన మూడు లాక్ డౌన్ల కంటే నాలుగోది భిన్నంగా ఉంటుందని చెప్పారు. మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి  పునర్నిర్మాణం చేసేందుకు 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రకటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆమె మీడియాతో అన్ని విషయాలు స్పష్టం చేయనున్నారు. ఈ క్రమంలో భారీ ఆర్ధిక ప్యాకేజీ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను పునర్మిర్మితం చేసేందుకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇంతకు ముందు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంబంధం లేకుండా పేదలను ఆదుకునేందుకు 1.74 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా పేదల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయడంతోపాటు ఆహార భద్రత, 50 లక్షల బీమా లాంటి పథకాలు అమలు చేశారు. 
  
దేశీయ జాతీయోత్పత్తిలో 10 శాతంగా ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ కూలీలు, వ్యవసాయదారులు, పన్ను చెల్లింపుదారులు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు నిర్వహించే పారిశ్రామికవేత్తలకు ఆర్ధికంగా ఊతమివ్వనుంది.  రానున్న రోజుల్లో ఆర్ధిక సంస్కరణలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆర్ధిక మంత్రి వివరించనున్న ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ విశేషాలపై ఆసక్తి నెలకొంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..