EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులారా గమనించారా..నిబంధనల్లో కీలక మార్పులు ఇవే..!
EPFO: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి కీలక సూచన చేసింది. ఈఏడాది నుంచి అమలుకానున్న కొత్త రూల్స్‌ను ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) నిబంధనల్లో కీలక మార్పులు జరిగాయి. బడ్జెట్ ప్రతిపాదన ఆధారంగా మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పన్ను విధించేవి కాగా..రెండోది పన్ను మినహాయింపు ఖాతాలుగా ఉన్నాయి. పీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతానికి పరిమితం చేశారు. గతేడాది వడ్డీరేటు 8.5గా ఉండేది. గడిచిన 40 ఏళ్లలో అత్యల్ప వడ్డీరేటు ఇదేనని అధికారులు తెలిపారు.
ఈపీఎఫ్ ఖాతాదారులు తెలుసుకోవాల్సి ముఖ్య అంశాలు ఇవే..!
* ఈఏడాది పీఎఫ్ వడ్డీరేటు 8.1 శాతంగా ఉంది.
* వార్షికంగా పీఎఫ్ ఖాతాదారుల వాటా రూ.2.5 లక్షలు దాటితే పన్ను చెల్లించాలి.
* పీఎఫ్ చందాదారుల వాటా వార్షికంగా రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే..ఎలాంటి పన్ను ఉండదు.
* కాంట్రిబ్యూషన్ థ్రైషోల్డ్ అనంతరం పెంచిన నగదుపై మాత్రమే పన్ను ఉంటుంది..మొత్తం నగదుకు ఉండదు.
* ఎంప్లాయ్ ఖాతాలో జమ అయ్యే నగదు, సొమ్ముపై వచ్చే వడ్డీని ఈపీఎఫ్‌లో ప్రత్యేక అకౌంట్‌లో ఉంచుతారు.
* ఉద్యోగి నెలవారి ఆదాయం రూ.15 వేలు వరకు ఉన్న వారి ఖాతాలో తప్పనిసరిగా పీఎఫ్ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది.
* ఖాతాదారుడి ఈపీఎఫ్‌కి యజమాన్యం నగదు జమ చేయకపోతే కాంట్రిబ్యూషన్ థ్రైషోల్డ్ రూ.5 లక్షలకు పెంచుతారు.
* తప్పనిసరిగా ఫారమ్ 16, ఫారమ్ 12బీఏలో నింపాల్సి ఉంటుంది.
Also read:PM Modi: దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరం..యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
Also read:CM Kcr: బీజేపీపై ఇక యుద్ధమే..టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook