FIR filed against Mark Zuckerberg over defamatory Facebook post against Akhilesh Yadav : మెటా కంపెనీ, ఫేస్‌బుక్‌ సీఈవో అయిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ పై (Mark Zuckerberg) యూపీలో కేసు ఫైల్ అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌.. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కు (Akhilesh Yadav) వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ వివాదాస్పదంగా మారింది. దీంతో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పై కేసు నమోదైంది.ఈ మేరకు యూపీలోని కన్నౌజ్‌ జిల్లాలోని (Kannauj district) కోర్టులో పరువు నష్టం కలిగిందంటూ కేసు నమోదైంది. జుకర్‌బర్గ్‌ తో పాటు మరో 49 మంది ( 49 others) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే జుకర్‌బర్గ్‌ కు సోషల్ మీడియాలో అఖిలేష్‌ మీద వచ్చిన పోస్ట్‌కి సంబంధం లేకున్నా కూడా ఆయన సీఈవోగా ఉన్న కంపెనీకి చెందిన సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ లో ఆ పోస్ట్‌ చేయడంపై జుకర్‌బర్గ్‌ పేరు చేర్చారు. కన్నౌజ్‌ జిల్లా సారాహతికి చెందిన అమిత్‌ (Amit) అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశాడు. అఖిలేష్‌ యాదవ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకే కొందరు అనుచిత పోస్ట్‌ చేశారంటూ అమిత్ పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్‌ నేరుగా కోర్టుకు వెళ్లి కేసు దాఖలు చేశారు. 


Also Read : Mahesh Babu Knee Surgery: మహేష్ బాబు మోకాలికి సర్జరీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్!


అయితే ఈ విషయంపై అంతకుముందు పోలీసులకు అమిత్ ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో నేరుగా కోర్టుకు వెళ్లినట్లు వెల్లడించారు. బువా బాబువా (Bua Babua) పేరుతో కొనసాగుతోన్న ఫేస్ బుక్ పేజీలో తరుచూ అఖిలేష్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా పోస్టులు పోస్ట్ చేస్తున్నారంటూ అమిత్ పేర్కొన్నారు. ఇక ఈ కేసుపై (Case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


Also Read : CM Jagan: సిరివెన్నెల కుటుంబానికి అండగా సీఎం జగన్-ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook