CM Jagan: సిరివెన్నెల కుటుంబానికి అండగా సీఎం జగన్-ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు

AP Govt to bear sirivennela seetharamasastry hospitalisation charges : దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 06:51 PM IST
  • సిరివెన్నెల ఆసుపత్రి ఖర్చులు భరించనున్న ఏపీ ప్రభుత్వం
  • సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలని సీఎం జగన్ ఆదేశాలు
  • సీఎం జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు
 CM Jagan: సిరివెన్నెల కుటుంబానికి అండగా సీఎం జగన్-ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు

AP Govt to bear sirivennela seetharamasastry hospitalisation charges : దివంగత సినీ సాహితీ దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seethamasastry) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అండగా నిలిచింది. సిరివెన్నెల ఆసుపత్రి ఖర్చులన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కింద ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలిచ్చిన వెంటనే అధికారులు సిరివెన్నెల (Sirivennela Seethamasastry) కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఈ విషయాన్ని సిరివెన్నెల పెద్ద కుమారుడు, సంగీత దర్శకుడు సాయి యోగేశ్వర్ వెల్లడించారు. మంగళవారం (నవంబర్ 30) ఉదయం ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అధికారులు... ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారన్నారు. ఆ మేరకు సీఎం జగన్ ఆదేశాలిచ్చినట్లు తమతో చెప్పారని తెలిపారు.

బుధవారం (డిసెంబర్ 1) జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన సిరివెన్నెల అంత్యక్రియలకు (Sirivennela Last Rites) హాజరైన సందర్భంగా మంత్రి పేర్ని నాని కూడా తమతో ఈ విషయం చెప్పారని పేర్కొన్నారు. ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని... అప్పటికే కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్ని నాని చెప్పినట్లు వెల్లడించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సీఎం జగన్‌కు తమ కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.

కాగా, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seethamasastry) ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4గం. సమయంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇటీవలే కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు ఎక్మోపై చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. 

Also Read: Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News