బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ మేరకు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. నిన్న ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షబానా ఆజ్మీ ప్రయాణిస్తున్న కారు .. ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై నిన్న ప్రమాదానికి గురైంది. హైవేపై మితి మీరిన వేగంతో వెళ్లడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులు షబానా ఆజ్మీ కారు డ్రైవర్ అమ్లేష్ యోగేంద్ర కామత్‌ను  అరెస్టు చేశారు. మితిమీరిన వేగంతో కారు నడిపినందు వల్ల అతనిపై రాష్ డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేశారు. షబానా ఆజ్మీ ప్రయాణిస్తున్న కారు .. ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టడం వల్ల షబానా ఆజ్మీ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ షబానా ఆజ్మీని స్థానికులు ముంబైలోని MGM ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కోకిలా బెన్ ఆస్పత్రికి తరలించారు. షబానా ఆజ్మీ  వెన్నెముక తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు ప్రకటించారు.


[[{"fid":"181209","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరోవైపు అదే కారులో ప్రయాణిస్తున్న షబానా ఆజ్మీ భర్త పాటల రచయిత జావెద్ అక్తర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ట్రక్కు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షబానా ఆజ్మీ కారు డ్రైవర్ యోగేంద్ర కామత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..