INS Vikramaditya: భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ సిబ్బంది మొత్తం సురక్షితంగా బయటపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత నావికాదళం (Indian Naval Command)లో కీలకంగా ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు పెను ప్రమాదం తప్పింది. నౌకలో మంటలు చెలరేగి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు నేవీ ప్రతినిధి తెలిపారు. నౌకలోని సిబ్బంది పొగను గమనించి  వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని అన్నారు. దీంతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యుద్ద నౌక కర్ణాటకలోని కార్వార్‌ నౌకాశ్రయంలో ఉంది.ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది నావికా దళం. కీవ్‌-క్లాస్‌ అనే యుద్ధ నౌకను భారత్‌ 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసి, దానికి  విక్రమాదిత్య చక్రవర్తి‌పై గౌరవార్థం ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య( INS Vikramaditya) గా పేరు పెట్టారు. 20 అంతస్తుల ఎత్తు, 22 డెక్స్‌తో సుమారు 16 వందలమంది సిబ్బంది సామర్ఠ్యం కలిగిన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు, 60 మీటర్ల బేస్‌తో మూడు ఫుట్‌బాల్‌ మైదానాల వైశాల్యం కలిగి ఉంటుంది.


Also read: Tamilnadu lockdown: మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌‌డౌన్, మే 10 నుంచి 24 వరకూ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook