Maharashtra fire accident: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగిపోయింది. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఏకంగా 14 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా తొలిదశలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో లేదా కోవిడ్ సెంటర్లలో అగ్నిప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోరనా సెకండ్ వేవ్( Corona Second Wave) లో కూడా ఇదే తరహా ప్రమాదాలు ప్రారంభం కావడం ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఘోరం( Maharashtra fire accident) దీనికి ఉదాహరణ. ముంబైకు సమీపంలో ఉన్న విరార్‌లోని ఓ ఆసుపత్రిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్‌ వల్లబ్‌ ఆసుపత్రి( Vijay Vallabh Hospital)లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఐసీయూలో (ICU Ward) చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు  బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవ దహనమయ్యారు ( 14 patients burnt alive). ఈ ఆసుపత్రిలో మొత్తం 90 మంది రోగులున్నారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3-4 గంటల సేపు ప్రయత్నించి మంటల్ని అదుపులో తీసుకొచ్చారు. 


Also read: Supreme court Chief justice: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్ వి రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook