Supreme court Chief justice: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్ వి రమణ

Supreme court Chief justice: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాథ్యతలు చేపట్టబోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2021, 08:50 AM IST
Supreme court Chief justice: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్ వి రమణ

Supreme court Chief justice: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాథ్యతలు చేపట్టబోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా( Supreme court Chief justice) చేసిన జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ( Justice S A Bobde) నిన్నటితో అంటే ఏప్రిల్ 23వ తేదీతో పదవీ కాలం పూర్తయింది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ పేరును స్వయంగా ఎస్ఏ బాబ్డే సిఫార్సు చేయగా..ఏప్రిల్ 5వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఛీఫ్ జస్టిస్‌గా ఎన్ వి రమణ ( Justice N V Ramana new chief justice) 2022 ఆగస్టు 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan) ‌లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా రామ్‌నాథ్ కోవింద్( Ramnath Kovid) చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్ వి రమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి..2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యమయ్యారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు కృషి చేశానన్న సంతృప్తితో ఉన్నానని..జస్టిస్ ఎస్ఏ బాబ్డే (Justice SA Bobde)అభిప్రాయపడ్డారు. కోర్టు హాల్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. బాధ్యతల్ని జస్టిస్ ఎన్ వి రమణకు అప్పగిస్తున్నానని..సమర్ధవంతంగా కోర్టును నడిపిస్తారన్న నమ్మకముందని ఎస్ ఏ బాబ్జే తెలిపారు. క్రమశిక్షణతోనే కరోనాను జయించగలమని మరి కాస్సేపట్లో ఛీప్ జస్టిస్‌గా ప్రమాణం చేయబోతున్న జస్టిస్ ఎన్ వి రమణ ( Justice NV Ramana) తెలిపారు. మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, అవసరముంటేనే బయటకు రావడం వంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలన్నారు. 

Also read: Marriage కి వెళ్లి వస్తున్న కుటుంబం.. నదిలో పడిన van.. 15 మంది మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News