గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం(Gujarat Fire Accident) సంభవించింది. అహ్మదాబాద్‌లోని సనంద్ ప్రాంతంలో ఉన్న గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Gujarat Industrial Development Corporation) ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారత్‌లో తొలిసారి.. పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధర


సమాచారం అందుకున్న వెంటనే 25 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదం(Fire Accident)లో ఓ ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒకచోట చిన్న నిప్పురవ్వ రావడంతో అది పెద్దగా మారి భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు సమాచారం. ఏ మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ