Fire breaks in COVID hospital - Five people died: రాజ్‌కోట్‌: గుజరాత్‌ (Gujarat) లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు. రాజ్‌కోట్ నగరంలోని ఉదయ్ శివానంద్ కోవిడ్ ఆసుపత్రి (Shivanand COVID Hospital in Rajkot) లోని ఐసీయూ విభాగంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొంతున్న ఐగుగురు ( Five Corona patients died) కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ఐసీయూలో 11 మంది రోగులున్నారని వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాద సమయలో ఆసుపత్రిలో మొత్తం 33 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఐసీయూలో మంటలు చెలరేగాయి. Also read: Tejaswi Surya: బీజేపీ ఎంపీ తేజస్విపై కేసు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. శివానంద్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (CM Vijay Rupani) దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మృతులకు ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంతాపం తెలిపారు. Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe