60 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం
42 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం
'ది 42' అనే 60 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన శనివారం సాయంత్రం కోల్కతాలోని చొరింగీ రోడ్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోని 51, 52 అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. భవనంలోపల జరుగుతున్న వెల్డింగ్ పనులే ఈ అగ్ని ప్రమాదానికి కారణమై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కోల్కతాలో అత్యధిక ఎత్తైన భవనంగా పేరొందిన 'ది 42' ప్రస్తుతం నిర్మాణదశలో ఉంది.