MP Fire Accident: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులను ఖాళీ చేయిస్తున్నారు. జబల్‌పూర్‌లోని గొహల్పూర్ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దామోహ్ నాకా ప్రాంతంలోని న్యూ లైఫ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఐదుగురు రోగులు కాగా..ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 


అగ్నిప్రమాదం ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ఘటనపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



Also read:CM Jagan Review: ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించాలి..గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ రివ్యూ..!


Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook