త్వరలో జరగబోతున్న కర్ణాటక ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీ తన తొలివిడత జాబితాగా 72 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆదివారం సాయంత్రం ఈ ప్రకటనను విడుదల చేశారు. కర్ణాటకలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీఎస్ ఎడ్యూరప్ప నిలుచోనున్నారు. శికారిపుర ప్రాంతం నుండి ఆయన పోటీ చేయనున్నారు. ఆదివారమే బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమావేశంలోనే అభ్యర్థుల పేర్లను కేంద్ర మంత్రి జేపీ నద్దా ప్రకటించారు. మే 12వ తేది నుండి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేది నుండి కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి. ఈసారి ఈవీఎం మెషిన్లతో పాటు వీవీపాట్ మెషీన్లను ఓటర్లకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 17వ తేదిన వెలువడుతుంది.


ఏప్రిల్ 24వ తేది వరకు నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. ఏప్రిల్ 27వ తేదిని నామినేషన్ నుండి విరమించుకోవడానికి ఆఖరు తేదిగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అదే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మంచి 
పోటీనే నెలకొంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఉంది. 122 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు