జమ్మూలో హిమపాతం; ఐదుగురు జవాన్లు గల్లంతు
బందిపోరా జిల్లాలో భారీ హిమపాతం కారణంగా ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో హిమపాతం అక్కడికి ప్రజలకు ఒకవైపు ఇక్కట్లకు గురి చేస్తుంటే.. భారత జవాన్ల పాలిట శాపంగా తయారైంది. బందిపోరా జిల్లాలో భారీ హిమపాతం కారణంగా ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు. గురేజ్ సెక్టార్ లోని బక్తూర్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. అధికారులు అప్రమత్తమై గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. ఇదివరకు ఇదే సెక్టార్ లోనే తులైల్ లో ఒక జవాన్ హిమపాతం కారణంగా మృతిచెందారు. కాగా ఇదే సంవత్సరం జనవరి 26న హిమపాతం కారణంగా 10 మంది ఇదే ప్రదేశంలో మృత్యువాతపడ్డారు.
జవాన్లతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పలువురు సహచరులు కూడా గల్లంతయ్యారు. హిమపాతం కారణంగా ఇప్పటికే జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారిని మూసేశారు. మంచుతోపాటు వర్షం కూడా కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయని వాతావరణ అధికారులు తెలిపారు.