న్యూ ఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి వ్యాప్తంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ను ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేశ రాజధానిలో మరో ఐదు కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. మరోవైపు  దేశవ్యాప్తంగా 606 పాజిటివ్ కేసులు నమోదు కాగా, దీని బారిన పడి పది మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. 30 మంది పాజిటివ్ కేసుల్లో, ప్రస్తుతం 23 మంది ఐసొలేషన్ లో ఉన్నారని తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ధోనీ ఫ్యాన్స్‌‌కి ఆగ్రహం తెప్పించిన BCCI పోస్టర్


దేశ రాజధాని ఢిల్లీలో అధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లెఫ్టినెంట్-గవర్నర్ అనిల్ బైజల్ మాట్లాడుతూ ఢిల్లీలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని, అప్రమత్తత అవసరమని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా, బస్సులు, క్యాబ్‌లు, రిక్షాలతో సహా అన్నింటినీ నిలిపివేయాలని, అత్యవసర సేవలకు మాత్రమే  అవకాశమివ్వాలన్నారు. 


Read also :బట్టలు ఉతుకుతూ.. బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. ఫన్నీ వీడియో


ఉల్లంఘనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలుంటాయని, ఇళ్ళ నుండి బయటకు రాకూడదని, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేయాలని సంబంధిత అధికారుల ఆదేశాలను అనుసరించాలన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..