ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది నిరసనకు దిగడంతో అక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాలకు కొంత అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు ఒప్పందం పద్ధతిలో సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లిమిటెడ్ సిబ్బంది నిరసనకు దిగి పనిలోకి రాని కారణంగా అక్కడికి వచ్చి, పోయే విమానాల సమయాల్లో ఆలస్యం అవుతోంది. దీంతో ఇప్పటి వరకు దేశీయంగా సేవలు అందిస్తున్న 8 విమానాలతోపాటు మరో 16 అంతర్జాతీయ విమానాలకు ఆలస్యం జరిగినట్టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది.


ఇవాళ ఉదయం నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుండగా, తాత్కాలికంగా ఎయిర్ ఇండియా శాశ్వత సిబ్బందిని రంగంలోకి దింపి పరిస్థితిని చక్కదిద్దేందుకు విమానాశ్రయం వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.