ఢిల్లీలో పొగమంచు కప్పేసింది. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో వాతావరణం సాధారణస్థాయి కంటే దిగువకు పడిపోయింది. చలితీవ్రత కూడా గణీనీయంగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీవాసులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఉదయం.. సాయంత్రం అనే తేడా లేకుండా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా.. ఢిల్లీలో పొగమంచు కారణంగా నేడు కూడా విమాన, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారతీయ రైల్వే శాఖ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని 21రైళ్లను రద్దుచేసింది. 64 రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని..  24 రైళ్ల వేళల్లో మార్పులు చేశామని చెప్పింది. 


ఇక ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇరవై దేశీయ, అంతర్జాతీయ విమానాలు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆరు విమానాలను రద్దుచేశారు.