కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తమ పార్టీకి చెందిన మహిళా నేతను, ఎన్నికల అభ్యర్థిని సీఎం పదవిని నిర్వహించిన వ్యక్తి ఐటమ్ అని సంభోదించడం ఏంటని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన కమల్‌నాథ్ (Former Madhya Pradesh CM Kamal Nath) వివరణ ఇచ్చుకున్నారు. తనకు ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి పేరు గుర్తుకురాలేదన్నారు. అందుకే తాను ఐటం అని సంభోదించినట్లు చెప్పారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా జాబితాను ప్రవేశపెట్టిన సమయంలోనూ మనం ఐటం నెంబర్ 1, 2 అని చెబుతుంటాం కదా.. అదే తీరుగా తాను బీజేపీ మహిళా నేత ఇమర్తీ దేవిని ఐటం అని ప్రస్తావించానని పేర్కొన్నారు. ఇందులో ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే నిరాడంబర వ్యక్తి అని, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ అభ్యర్థి ఓ ఐటం అంటూ కమల్‌నాథ్ నోరు జారడంతో వివాదం మొదలైంది.



 


మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ సైతం కమల్‌నాథ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు. కమల్‌నాథ్ వయసు 74 ఏళ్లు అని గుర్తుందా అని ప్రశ్నించారు. మహిళా నేత ఇమర్తీ దేవిని మీరు అలా పిలవడమే తప్పు అని మేం చెబుతుంటే .. అందర్నీ అలాగే సంభోదిస్తామని మాట్లాడటం దారుణం అంటూ శివరాజ్ చౌహాన్ మండిపడ్డారు. ఎవరైనా తన తల్లిని, చెల్లిని కూడా ఐటం అని పిలుస్తారా.. ఇదేనా పద్ధతంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.



 


కాగా, మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతిరాదిథ్య సింధియాతో పాటు డబ్రాలో ప్రస్తుతం బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవి, మొత్తం 22 మంది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. భారీగా పార్టీ ఫిరాయింపులతో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe