బెంగళూరు: ఓవైపు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమై పోరాడుతోంటే (Fighting against COVID-19) .. మరోవైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి శుక్రవారం తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి వివాహ వేడుకను (Kumaraswamy`s son Nikhil's wedding) జరిపించారు. బెంగళూరు శివార్లలోని రామనగరంలో జరిగిన ఈ వివాహాన్ని కవర్ చేసేందుకు మీడియా సిబ్బందిని అనుమతించలేదు. కానీ ఈ వివాహ మహోత్సవానికి అనేక మంది విఐపి అతిథులుగా హాజరైన (VIPs attended Nikhil's wedding) తీరు చూస్తోంటే.. వీలు ఉన్నంత మేరకు పెళ్లి ఘనంగానే జరిగినట్టు తెలుస్తోంది. వివాహ వేడుక ఫోటోలు, వీడియోలు చూస్తుంటే సోషల్ డిస్టన్సింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. Also read : చైనాలో 50 శాతం పెరిగిన కరోనా మరణాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"184450","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దేశానికి మాజీ ప్రధాని, రాష్ట్రానికి మాజీ ముఖ్య మంత్రి ఉన్న ఇంట్లో ఇలా లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వివాహం జరిపించడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ పెళ్లి గురించి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ వివాహం ఎంతో సాదాసీదాగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకకు హాజరుకావద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ పెళ్లి జరిగిన తీరు సాదాసీదాగానే ఉన్నప్పటికీ.. సోషల్ డిస్టన్సింగ్ నిబంధనను మాత్రం అతిక్రమించడమైతే జరిగింది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  Photos: నిఖిల్ కుమారస్వామి పెళ్లి వేడుక ఫొటోలు


Also read : శుభవార్త.. ఇక 10 నిమిషాల్లో కరోనా ఫలితాలు


ఇదిలావుంటే, కర్ణాటకలో నేడు కొత్తగా 38 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కర్ణాటకలో ఒకే రోజులో ఇంత అధిక సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 353 కి పెరిగింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత 82 మంది రోగులు డిశ్చార్జ్ కాగా.. మరో 13 మంది చనిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..