అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. కరోనా టెస్టుల ఫలితాలు కేవలం 10 నిమిషాల్లో తేల్చే కిట్లు ఏపీకి వచ్చేశాయి. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష కిట్లను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఈ సూపర్ ఫాస్ట్ టెస్టులు చేసే కిట్లతో కరోనా అనుమానితులకు సాధ్యమైనంత వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి పాజిటివ్‌గా తేలిన వారికి తక్షణమే ట్రీట్ మెంట్ ప్రారంభించవచ్చు. ఆమె అందాలకు నెటిజన్లు LockDown
దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా కిట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇకనుంచి ఏపీలో కరోనా పరీక్షలు వేగవంతం కానున్నాయని, కరోనా లక్షణాలున్న వారు వెంటనే దగ్గర్లోని కేంద్రాలకు వెళ్లి కోవిడ్19 టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సూచించారు. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!
ప్రస్తుతం ట్రూనాట్ కిట్ల ద్వారా 49 కేంద్రాల్లో రోజుకు 3నుండి 4వేల వరకు కరోనా టెస్టులు జరుగుతున్నాయి. కోవిడ్19 ర్యాపిడ్ డయాగ్నిస్టిక్ కిట్లు అందుబాటులోకి రాగానే రోజుకు 17వేలకు పైగా టెస్టులు చేస్తామని నేటి ఉదయం అధికారులు తెలిపారు. ఇన్‌ఫెక్షన్ రేటును గుర్తించేందుకు భారీ స్థాయిలో టెస్టులు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
కాగా, శుక్రవారం ఉదయం నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. ఇందులో చికిత్స తర్వాత 35 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా బారిన పడి 14 మంది మరణించారు. ప్రస్తుతం 523 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
శుభవార్త.. ఇక 10 నిమిషాల్లో కరోనా ఫలితాలు