దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah Tests Positive For CoronaVirus)చేరారు. తనకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షనేత సిద్ధరామయ్య (Siddaramaiah Tested COVID19 Positive) తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకినట్లు తెలిపారు. కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైద్యుల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని సిద్ధరామయ్య (Siddaramaiah COVID19 Positive) పేర్కొన్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి తనను కలిసిన వారు కోవిడ్19 టెస్టులు చేయించుకోవాలని, సొంతంగా క్వారంటైన్‌లో ఉండాలని సైతం తన ట్వీట్ ద్వారా సూచించారు. COVID19 Medicine: రూ.59కే కరోనా ట్యాబ్లెట్..



కాగా, కర్ణాటక సీఎం యడియూరప్ప ఇదివరకే కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యడియూరప్పతో పాటు ఆయన కూతురికి సైతం కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...  


COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే