Sunnam Rajaiah: కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (Ex MLA Sunnam Rajaiah dies) కన్నుమూశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన చనిపోయారు.

Last Updated : Aug 4, 2020, 07:47 AM IST
Sunnam Rajaiah: కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

Sunnam Rajaiah Is No More | కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(59) కన్నుమూశారు. సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు భద్రాచలంలోని ఓ హాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. కోవిడ్19 టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రకి తరలిస్తుండగానే సున్నం రాజయ్య మృతి (Sunnam Rajaiah Died) చెందారు. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా సున్నం రాజయ్య విజయం సాధించారు. 1999, 2004, 2014 అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి విశేష సేవలందించారు. సున్నం రాజయ్య మృతి పట్ల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే 
 Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?

Trending News