Former President Pranab Mukherjee’s health condition: న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (RR) ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అయితే కరోనా సోకడంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఈనెల 10వ తేదీన ఆర్ఆర్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన బ్రెయిన్‌‌‌‌లో బ్లడ్‌‌‌‌ క్లాట్‌‌‌‌ కావడంతో సోమవారం వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగుపడలేదని, ఇంకా మరింత క్షీణించిందని బుధవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  Also read: Brain Surgery: వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్



ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా ముఖర్జీ ప్రార్ధించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో తన తండ్రి గురించి ఆవేదన వ్యక్తంచేశారు. దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నానని ప్రార్థిస్తూ ఆమె ట్విట్టర్‌లో రాశారు. ఇదిలాఉంటే.. పశ్చిమ బెంగాల్‌లోని ప్రణబ్‌ పూర్వీకుల గ్రామంలో మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు. అయితే ప్రణబ్ ముఖర్జీ 2012-2017 మధ్యకాలంలో భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు.  Also read: Corona virus: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కు కరోనా