కరోనా మహమ్మారి ( Corona pandemic ) కి నీ నా తేడా ఉండటం లేదు. అందర్నీ వశపర్చుకుంటుంది. మొన్న అమితాబ్ కుటుంబం..నిన్న అమిత్ షా...నేడు మాజీ రాష్ట్రపతి. ఇప్పుడీ విషయాన్ని స్వయంగా ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగోరోజు కూడా దేశం మొత్తం మీద 62 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సెలెబ్రిటీలు, రాజకీయనేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కంటికి కన్పించని శత్రువు అందర్నీ చుట్టేస్తోంది. మొన్న అమితాబ్ కుటుంబం ( Amitabh family ) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central home minister Amit shah ) కు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు ( Ex president pranab mukherjee ) కరోనా సోకింది. ఆయన స్వయంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని...గత రెండు వారాల్లో తనను కలిసిన వారంతా ఐసోలేషన్ కు వెళ్లడమే కాకుండా పరీక్షలు చేయించుకోవాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22 లక్షల 15 వేల 75 కు చేరుకుంది. 15 లక్షల 35 వేలమంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6 లక్షల 34 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ దేశంలో కరోనా కారణంగా 44 వేల 386 మంది మరణించారు. Also read: Chennai Airport: హిందీ తెలియకపోతే భారతీయులు కాదా: కణిమొళి ట్వీట్