Pranab Mukherjee on ventilator: న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. కరోనా (Coronavirus) సోకడంతో నిన్ననే ఆయన ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. Also read: Corona virus: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కు కరోనా
Former President Pranab Mukherjee (in file photo) is presently on ventilator support at Army's Research and Referral (R&R) Hospital in Delhi. He underwent brain surgery: Sources
The former President yesterday tweeted that he tested positive for COVID-19. pic.twitter.com/qGnK9Gnlgq
— ANI (@ANI) August 10, 2020
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్ చేసి వెల్లడించారు. తాను సాధారణ వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా.. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వారం రోజులుగా తనను కలుసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. Also read: Chennai Airport: హిందీ తెలియకపోతే భారతీయులు కాదా: కణిమొళి ట్వీట్
ఇదిలాఉంటే.. 84 ఏళ్ల వయసున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా జరిగిందని అధికారులు వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆర్‌అండ్‌ఆర్ ఆసుపత్రిని సందర్శించి, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. Also read: Donkey Milk: త్వరలో గాడిద పాల డెయిరీ ప్రారంభం