Former Punjab CM Captain Amarinder Singh joins BJP: పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh) కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.  దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిరణ్‌ రిజిజు సహా పంజాబ్‌ భాజపా అధ్యక్షుడు అశ్వినీ శర్మ తదితర నేతల సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా తాను స్థాపించిన పంజాబ్‌ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ నేత పంజాబ్‌ మాజీ ఉపసభాపతి అజైబ్ సింగ్‌ భట్టి కూడా భాజపా గూటికి చేరారు. అయితే అమరీందర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 ఏళ్లుగా హస్తం పార్టీలో ఉన్న అమరీందర్ గతేడాది ఆపార్టీతో తెగదింపులు చేసుకుని కొత్త పార్టీ స్థాపించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో అమరీందర్ కూడాఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం తాను భాజపాలో చేరినా.. నా భార్య ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. భర్తను భార్య అనుసరించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కెప్టెన్ చెప్పుకొచ్చారు. మరి అమరీందర్ ఇమేజ్ బీజేపీకు ఏ మాత్రం కలిసి వస్తుందో వేచిచూడాలి. 


Also Read: Sharad Pawar: ఉత్తర భారతం వల్లే మహిళా రిజర్వేషన్ రావడం లేదు..శరద్ పవార్ హాట్ కామెంట్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి