Former Union Home Minister Buta Singh passed away | న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీ‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మెదడులో రక్తస్రావం (brain hemorrhage) తో గతేడాది అక్టోబర్ నుంచి కోమాలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో (AIIMS) మరణించినట్లు బూటా సింగ్ కుటుంబసభ్యులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బూటా సింగ్‌ (Buta Singh) కు దళితనేతగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. రాజీవ్ గాంధీ కేబినెట్‌లో 1986 నుంచి 89 వరకు కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా బీహార్ గవర్నర్‌గా కూడా సేవలందించారు. బూటాసింగ్ రాజకీయ కెరీర్ మొట్ట మొదటిసారిగా అకాలీదళ్ (Akali Dal) నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత 1960లో ఆయన కాంగ్రెస్‌ (Congress) లో చేరారు. 1962లో సాధ్నా నియోజకవర్గం నుంచి మొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2007 నుంచి 2010 వరకు కేంద్ర షెడ్యూల్డ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. Also Read: Katta Venkata Narasaiah: మధిర మాజీ ఎమ్మెల్యే కన్నుమూత


దీంతోపాటు 1970, 80 ద‌శ‌కాల్లో బూటా సింగ్ ఖ‌లిస్తాన్ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. ఆప‌రేష‌న్ బ్లూ స్టార్‌ల్, గోల్డెన్ టెంపుల్ పున‌:నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయంగానే కాకుండా బూటా సింగ్ సాహిత్య పరంగా కూడా గుర్తిపు పొందారు. పంజాబీ సాహిత్యంతో పాటు సిక్కు సాహిత్యంపై అనేక వ్యాస సంకలనాలు, పుస్తకాన్ని సైతం రచించారు. బూటా సింగ్ మృతిప‌ట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంతాపం తెలియజేశారు. దేశం నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుడిని కోల్పోయిందని ట్విట్ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Also Read: India Covid-19: 99లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook