Katta Venkata Narasaiah: మధిర మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు.

Last Updated : Jan 2, 2021, 12:05 PM IST
Katta Venkata Narasaiah: మధిర మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Former MLA Katta Venkata Narasaiah passes away | హైదరాబాద్: తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటనర్సయ్య హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన (Katta Venkata Narasaiah) పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. 

కట్టా వెంకటనర్సయ్య.. మధిర (Madhira) శాసనసభ స్థానం నుంచి రెండుసార్లు సీపీఎం (CPM) ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆ తర్వాత 2009 శాసనసభ ఎన్నికలకు నెల ముందు సీపీఎం పార్టీలోని నాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కట్టా వెంకటనర్సయ్య స్వగ్రామం కల్లూరు మండలంలోని పోచవరం. Also Read: India Covid-19: 99లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

యుక్త వయసు నుంచి రాజకీయాల్లో ఉన్న కట్టా వెంకటనర్సయ్యకు ఖమ్మం (Khammam) జిల్లాతోపాటు.. మధిర నియోజకవర్గంపై ఎంతో పట్టు ఉంది. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన పని చేశారు. కట్టా మృతి పట్ల సీపీఎం సహా.. పలు పార్టీల నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Also read: COVID-19: ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. వారి నుంచి మరో ఆరుగురికి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News