Fouth wave alert: దేశంలో స్థిరంగా కరోనా వ్యాప్తి.. మెుత్తం కేసుల ఎన్నంటే?
India Corona Update: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 16,135 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 24 మంది మృతి చెందారు.
India Corona Update: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,135 పాజిటివ్ కేసులు (Corona cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో మరో 24 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్ నుంచి 13,958 మంది రికవరీ అయ్యారు. దీంతో మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. డైలీ పాజిటివ్ రేటు 4.8శాతంగా ఉంది.
దేశంలో ప్రస్తుతం 1,13,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మెుత్తం మరణాల సంఖ్య 5,25,223 కాగా... కోలుకున్నవారి సంఖ్య: 4,28,79,477గా ఉంది. నిన్న 3,32,978 మందికి కొవిడ్ టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం 1,78,383 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మెుత్తం టీకా డోసుల సంఖ్య 1,97,98,21,197గా ఉంది.
వరల్డ్ వైడ్ గా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,36,614 మందికి వైరస్ సోకింది. వైరస్ తో మరో 566 మంది చనిపోయారు. ఇటలీలో కరోనా కోరలు చాస్తోంది. అక్కడ నిన్న ఒక్క రోజే 71వేలకు పైగా కేసులు నమోదు కాగా..61 మంది మృతి చెందారు. తైవాన్ లో కూడా భారీ స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి.
Also Read: Rain Alert: అల్పపీడనం ముంచుకొస్తోందా..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook