Last date to Update Aadhaar for Free: ఆధార్ కార్డ్ హోల్డర్లకు ముఖ్యగమనిక. మీ ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది. ఆధార్‌ కార్డులో వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14వ తేదీ వరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ నిర్ణయం తీసుకుంది. myAadhaar పోర్టల్‌లో ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకోవచ్చు. తమ గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్‌తో ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లో 'ఫ్రీ ఆఫ్ కాస్ట్'లో అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొంటూ UIDAI ట్వీట్ చేసింది. ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును గతంలో చాలాసార్లు పెంచిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఆ గడువును పొడగించే అవకాశాలు కనిపించడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

myAadhaar పోర్టల్‌లో ఫ్రీ సేవ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. మీరు మీ సేవా లేదా ఇతర ఆధార్ సెంటర్లలో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు వెళితే.. అక్కడ రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ చేయకపోతే.. కచ్చితంగా చేసుకోవాలని UIDAI స్పష్టం చేసింది. తమ సమాచారాన్ని తిరిగి ధృవీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 


మీరు పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. స్థానిక ఆధార్ కేంద్రంలో చేసుకుంటే రూ.50 ఇవ్వాల్సి ఉండగా.. ఆన్‌లైన్‌లో ఫ్రీగా అయిపోతుంది. ఆన్‌లైన్‌లో ఇలా చేసుకోండి.


==>  https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి
==> 'డాక్యుమెంట్ అప్‌డేట్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 
==> మీ వివరాలను వెరిఫై చేసుకోండి. ఆ తరువాత హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి.
==> డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్‌లను సెలెక్ట్ చేసుకోండి.
==> స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి.. కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి
==> ఆ తరువాత వివరాలను అప్‌డేట్ చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.


 



గత పదేళ్లుగా చాలామంది ప్రజలు ఆధార్ కార్డు పొందిన తరువాత అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఆధార్ ఎంతో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే 1,200 ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా మారింది. మీ ఆధార్‌ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉన్నా ఈ నెల 14వ తేదీలోపు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి.


Also Read:  Free Bus Journey: రేపటి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ.. ఈ బస్సుల్లోనే అనుమతి.. రూల్స్ ఇవే..!


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి