Frustration on Ola: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరితో ఇలాగే ఉంటుందేమో. నిరసన తెలిపేందుకు ఇంతకంటే వినూత్న పద్ధతి కూడా ఉండదేమో. విసుగెత్తిన ఆ వ్యక్తి ..అందుకే ఓలా ఈవీ స్కూటర్‌ను గాడిదకు కట్టి ఊరేగించాడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నరీతిలో నిరసన తెలిపాడు. ఆ నిరసన ప్రభుత్వానికో..అధికారులతో వ్యతిరేకంగా కానేకాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీపై నిరసన అది. ఓలా కంపెనీ కస్టమర్ కేర్ వైఖరికి విసుగు చెందిన ఆ వ్యక్తి తన నిరసనను తెలిపేందుకు ఇదే మంచి పద్ధతనుకున్నాడు. ఇంతకంటే మరో మార్గం కూడా కన్పించనట్టుంది. ఆ వ్యక్తి పేరు పార్లికు చెందిన సచిన్ గిట్టే. 


పార్లికు చెందిన సచిన్ గిట్టే సెప్టెంబర్ 2021న ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. నాలుగు నెలల తరువాత అంటే ఈ ఏడాది జనవరిలో పని చేయడం ఆగిపోయింది. కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయగా..ఓలా కంపెన ఓ మెకానిక్‌ను పంపించింది. అయితే ఆ మెకానిక్ స్కూటర్ సమస్యను పరిష్కరించలేకపోయాడు. తిరిగి కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. కస్టమర్ కేర్ నుంచి సమాధానం రాలేదు. ఫ్రస్ట్రేషన్‌కు గురైన ఆ వ్యక్తి తన నిరసన తెలిపేందుకు ఓ వినూత్న పద్థతిని ఎంచుకున్నాడు.



ఆ ఆగిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గాడిదకు గట్టి..నడిరోడ్డుపై ఊరేగించాడు. కేవలం ఊరేగింపే కాదు..బ్యానర్లు కూడా పెట్టాడు. ఈ ఫ్రాడ్ కంపెనీతో జాగ్రత్తగా ఉండమంటూ సూచనలు చేశాడు. ఓలా టూ వీలర్ కొనవద్దంటూ పదే పదే విజ్ఞప్తులు చేశాడు. వాస్తవానికి ఓలా ఈవీ స్కూటర్ల నుంచి చాలా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అటు ఈ ఫిర్యాదుల కారణంగా కంపెనీ కూడా 1441 యూనిట్లను వెనక్కి రీకాల్ చేసింది.  ఆ వాహనాల్లో ఉన్నట్టుంది మంటలు వచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి. 


Also read: Governor Dispute: గవర్నర్ వ్యవస్థపై వివాదం, నిన్న తెలంగాణ, ఇవాళ తమిళనాడు..ఏది వాస్తవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.