Shah Rukh Khan: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉక్కపోత, ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉత్తరాదిలో అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక ఇళ్లలో ఏసీలు, కూలర్లు పెట్టుకొని సేదదీరుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎండల తీవ్రతపై ఓ ట్విట్టర్ యూజర్ సరదాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. భానుడి ప్రతాపాన్ని తగ్గించాలంటూ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ను ఉద్దేశిస్తూ శ్రీస్తి పాండే అనే మహిళ ట్వీట్ చేశారు. సూరజ్ కో మద్ధం కర్వాదో ప్లీజ్ అంటూ చేసిన ట్వీట్ తెగ షేర్ అవుతోంది. షారుఖ్ నటించిన కబీ ఖుషీ కబీ గమ్ సినిమాలో బిగ్ హిట్ అయిన సూరజ్ హువా మద్దం అనే సాంగ్ ను బేస్ చేసుకొని సరదాగా ఈ ట్వీట్ చేశారు. దయచేసి సూర్యుడిని తగ్గించండి అనే అర్థంతో ఉన్న ఈ ట్వీట్ ను నెటిజన్లు రకరకాల కామెంట్లతో విపరీతంగా షేర్ చేస్తున్నారు. సూర్యుడు మనను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక పలువురు షారుక్ మీమ్స్ తో ట్వీట్ కు రిప్లే ఇస్తున్నారు.



దేశంలో ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎండలు, వడగాలులతో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుకుంది. దీంతో మే 1 వరకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూనీ, మధ్యప్రదేశ్ , జార్ఖండ్ లోనూ ఈ నెలంతా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బానుడు భగ్గున మండుతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత కొన్ని రోజులుగా అధికంగా నమోదవుతోంది. ఈ మధ్య తెలంగాణలో కొన్ని చోట్ల కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. రుతుపవనాలు వచ్చేదాకా ఎండల తీవ్రత తప్పదని ఐఎండీ తెలిపింది.


Also Read: Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!


Also Read: Acharya OTT Release Date: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ అప్పుడే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook